రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం గుడిపాల మండలం పేనపల్లి రైల్వే స్టేషన్ నుండి కిలోమీటర్ దూరంలో వేగంగా వెళుతున్న రైలును చత్తీస్గడ్ కు చెందిన జీవన్ (40) అనే వ్యక్తి ఆపడానికి ప్రయత్నించాడు. రైలు ఢీకొట్టడంతో కిందపడి తీవ్ర గాయాలయింది. 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.