చిత్తూరు: మామిడి రైతులకు తప్పని కష్టాలు

76చూసినవారు
చిత్తూరు: మామిడి రైతులకు తప్పని కష్టాలు
దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డు చెప్పినట్లు జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. తోతాపూరి మామిడిని కిలో రూ. 8కు ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయాలని మంత్రులు, కలెక్టర్ ఆదేశిస్తున్నా ఎక్కడా ఆ హామీ అమలు కావడం లేదు. పలు చోట్ల రూ. 5 నుంచి రూ. 6 మాత్రమే కొంటామని తెగేసి చెప్తున్నారని రైతులు వాపోయారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీలో భారీగా పల్ఫ్ పేరుకుపోవడమే ఇందుకు కారణమని సమాచారం.

సంబంధిత పోస్ట్