చిత్తూరులోని మసీదుమిట్టలో సోమవారం వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న సాయితేజ, యాస్మిన్ భానును ఫిబ్రవరి 9న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 13న తిరుపతి రూరల్ పీఎస్లో పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. యాస్మిన్న సాయితేజతో పంపిచారు. తండ్రి ఆరోగ్యం బాలేదని యాస్మిన్ ను ఇంటికి రప్పించారు. అనంతరం యాస్మిన్ చనిపోయిందని సాయితేజకు సమాచారమిచ్చారు.