చిత్తూరు: మృతుల ఆత్మ శాంతించాలి: వైసీపీ

అహ్మదాబాద్ విమానం కూలిన దుర్ఘటనలో మరణించిన మృతుల ఆత్మ శాంతించాలని వైసిపి ఇంచార్జ్ విజయానందరెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతులకు ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.