మంత్రి అచ్చంనాయుడు ఒక రోజు పర్యటనలో భాగంగా రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. రేపు మధ్యాహ్నం 3. గం.లకు గుడిపాల మండలంలోని పల్లూరులోని పూడ్స్ అండ్ ఇన్స్ మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమకు చేరుకుంటారని తెలిపారు. అనంతరం మంగపట్నం మార్కెట్ యార్డుకు చేరుకుని మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.