చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు పంచాయతీ చింతగుంటూరు గ్రామంలోని శ్రీమరియమ్మ దేవస్థానం మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామస్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.