చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం పరిశీలించారు. నగర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.