రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శనివారం మంగసముద్రం వద్దనున్న మార్కెట్ యార్డులో మామిడి రైతులు, పండ్ల గుజ్జు పరిశ్రమల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. మామిడి రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, చివరి కాయలు కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.