ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన కంచర్ల రామయ్య గారి పెద్దకర్మకు ఎమ్మెల్యే హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను పరామర్శించారు.