చిత్తూరు నగరపాలక పరిధిలో మంగళవారం జరిగిన గంగమ్మ జాతరల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. వెంగళరావు కాలనీలో గంగమ్మ అమ్మవారికి హారతి పట్టి తొలి పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను శాలువలు కప్పి, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.