విమాన ప్రమాద దుర్ఘటన పై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని మేఘాన్ని సమీపంలో విమానం టేకప్ అయిన కొద్దిసేపటికి జనావాసాల పై కుప్ప కూలిన విమానం దుర్ఘటన బాధాకరమన్నారు. ప్రమాదం వార్త ఎంతో క్షోభ కలిగించిందన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం మరియు బలం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.