గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంగళవారం ఉదయం గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతర కోసం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను గ్రామస్తులు, స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడివీధీలో ప్రతిష్టించిన గంగమ్మను దర్శించుకున్నారు. మంగళహారతితో పూజలు చేశారు.