చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారు సమీక్షించారు. ప్రజా సంక్షేమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ జిల్లా కలెక్టర్ కు సూచించారు.