కూటమి ప్రభుత్వంతోనే నవ్యాంధ్ర సాధ్యమని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు మంగళవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఆయన స్పందించారు. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజాసంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.