సోలార్ మేళా పేరుతో అవగాహనా సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో ఆయన ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్ కో, నెడ్ క్యాప్, జిల్లా పరిషత్, డీఆర్డీఏ, బ్యాంక్ అధికారులతో జేసి విద్యాధరితో కలిసి సమావేశం నిర్వహించారు. సోలార్ రూఫ్ టాఫ్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.