చిత్తూరు జిల్లా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల డీసీఓగా టి. పద్మజ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు డీసీఓగా ఉన్న ప్రభావతమ్మను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరులో పనిచేస్తున్న పద్మజ త్వరలో చిత్తూరుకు వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. సొంత జిల్లాకు బదిలీ కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.