చిత్తూరు: 104 ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించండి

71చూసినవారు
చిత్తూరు: 104 ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించండి
చిత్తూరు నగరంలోని సీఐటియూ కార్యాలయంలో 104 ఏంఎంయూ యూనియన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ, 104 సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్నారు. అరబిందో యాజమాన్యం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాల్లో సీనియారిటీ ప్రకారం బదిలీలు చేసి, కొత్త నియామకాలు జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్