చిత్తూరు మండలంలోని గంగాసాగరం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు. వేలూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న బైకును చిత్తూర్ వైపు నుంచి వేలూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీద వెళుతున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.