చిత్తూరు నగరంలోని పాత డీపీఓ కార్యాలయంలో రేపు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10: 30 గంటల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి త్వరిత పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలతో బాధపడుతున్న ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.