
కేరళలో నిఫా వైరస్ కలకలం
కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. వైరస్ సోకి ఓ యువతి చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ ఈవెంట్స్ పై నిషేధం విధించారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని నిఫా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో హై అలర్ట్ జారీ చేశారు.