చిత్తూరు జిల్లాను నైరుతి రుతుపవనాలు పలకరించాయి. గడిచిన 24 గంటల్లో 20 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిండ్ర మండలంలో అత్యధికంగా 88. 2 మి. మీ, బైరెడ్డిపల్లెలో అత్యల్పంగా 2. 2 మి. మీ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా విజయపురంలో 65.6, యాదమరిలో 55.2, పాలసముద్రంలో 54.2, పలమనేరులో 3, బంగారుపాళ్యంలో 2.6 మి. మీ వర్షపాతం నమోదైంది.