చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉద్యోగుల బదిలీల విషయంలో ఆన్‌లైన్ విధానంలో ఇన్-అవుట్ చూపించే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు.