చిత్తూరు పోలీసుల ఆధ్వర్యంలో త్వరలో స్లో బైకు రైడింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ మంగళవారం తెలిపారు. డ్రైవర్లలో సహనాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 100 మీటర్ల దూరాన్ని కాలు కింద పెట్టకుండా చేరుకోవాలన్నారు. అర్హత ఉన్నవారు 9491074515 నంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విజేతలకు వరుసగా రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేలు ప్రైజ్ మనీ ఉంటుందన్నారు.