చిత్తూరు: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తహసిల్దార్ చంద్రశేఖర్

70చూసినవారు
చిత్తూరు: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తహసిల్దార్ చంద్రశేఖర్
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చిత్తూరు మండలంలోని ఇర్రువరం రెవెన్యూ సర్వే నంబర్ 250 లో కాలువ పోరంబోకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను గురువారం తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తొలగించారు. కాలవను ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించారన్న మేరీ ఫిర్యాదు మేరకు స్పందించిన తహసిల్దార్ సర్వే నిర్వహించి హరినాథ్ భూషణ్ అనే అతను తన పట్టా ల్యాండ్ తో పాటు కాలువ పోరంబోకు సంబంధించి ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నాడని నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్