చిత్తూరు పట్టణంలో బుధవారం దుండగులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దుండగుల దాడిలో గాయపడిన చంద్రశేఖర్‌ను టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్ గురువారం పరామర్శించారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని ఆయన అభినందించారు. పరిసరాల్లోని యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.