అమరావతిపై విష ప్రచారం చేస్తోన్న వైసీపీకి పుట్టుగతులు ఉండవని టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. మంగళవారం నాగయ్య కళాక్షేత్రం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పదేళ్లుగా వైసీపీ అమరావతిపై విష ప్రచారం చేస్తోందన్నారు. కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళల జోలికి వస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు.