ఈ నెల 9 న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. చిత్తూరులోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేయడానికి లేబర్ కోడ్స్ తీసుకోవడం దుర్మార్గమన్నారు. సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలన్నారు.