నగరి మండలంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుగ్గగుడి శివాలయ ప్రతిష్టను కాపాడాలని విశ్రాంత ఉపాధ్యాయుడు రఘునాథచారి బుధవారం కోరారు. బుగ్గగుడి అర్చకుడు కుప్పయ్య, అటెండర్ హరి వ్యవహార తీరు కారణంగా ఆలయ ప్రతిష్ట నానాటికి మసకబారుతోందన్నారు. అర్చకుడికి కాలు విరిగి నాలుగు నెలల పాటు విధుల్లో లేరన్నారు. ఆలయాన్ని త్వరగా మూసి వేస్తున్నారని, అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆయన వాపోయారు.