చిత్తూరు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

67చూసినవారు
చిత్తూరు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గుడిపాల మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు బుధవారం కోరారు. ఈ మేరకు ఆర్ఐని కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతూ, ఇంటి స్థలం కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్, అక్రిడిటేషన్ కమిటీలో ప్రాతినిధ్యం, జర్నలిస్ట్ కమిటీ ఏర్పాటు, మీడియా అకాడమీ బలోపేతం, అవార్డులు, బీమా సౌకర్యం, జర్నలిస్టుల వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్