చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 వ డివిజన్ లోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల అంతర్గత బదిలీలు ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఆరోగ్య విభాగ అధికారి డాక్టర్ లోకేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు , మేస్త్రులు , కార్యదర్శులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.