చిత్తూరు అరగొండ రోడ్డులో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం తడకర గ్రామానికి చెందిన దంపతులు బైక్‌పై చిత్తూరుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా, బ్యాన్స్ హోటల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడారు. వెంటనే వారిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.