చిత్తూరులో కాసేపటి క్రితం ఆరుగురు దొంగలు మారణాయుధాలతో ఓ షాపులో దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నలుగురుని స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరి కోసం వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పి మణికంఠ చందోలు రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక టీం షాపులో నక్కిన మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.