చిత్తూరు నగరంలోని మెసానిక్ మైదానంలో పిల్లలు అనుదినం ఆడుకుంటూ ఉంటారు. నీళ్ళ సంపు గత కొన్ని రోజులుగా తెరిచి ఉండడంతో పిల్లలు తల్లిదండ్రులలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియాలో ప్రచురించినా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికీ కూడా సంబంధిత అధికారులు స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తెరిచిన నీళ్ళు సంపు మూసివేయాలని కోరుతున్నారు.