చిత్తూరు: మా స్కూల్ మాకే కావాలి.. విద్యార్థుల నిరసన

66చూసినవారు
చిత్తూరు నగర పరిధిలోని ఒకటో డివిజన్ మురుకంబట్టు అగ్రహారంలో తమ స్కూలు తమ గ్రామంలోనే ఉండాలని గురువారం ఉదయం విద్యార్థులు మరియు గ్రామస్తులు స్కూలుకు తాళం వేసి ధర్నా చేశారు. చక్కటి పల్లెటూరి వాతావరణంతో విశాలమైన మైదానం కలిగి అన్ని సౌకర్యాలు ఉన్న తమ స్కూలుని ఎటువంటి సౌకర్యం లేని రోడ్డు సమీపంలోని ముర్కంబుట్ట స్కూలుకు మార్చడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా స్కూల్.. మాకే కావాలి అని నినాదాలు చేస్తూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్