చిత్తూరులో మేయర్ అముదా, పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆమె రోడ్డుపై ఉన్న గాంధిజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు రావడం జరిగింది. అయితే ఆ సమయంలో రోడ్డుపైనే తన వాహనాన్ని నిలిపివేయడంతో ట్రాఫిక్ సీఐ నిత్యబాబు వాహనం పక్కకు తీయాలని చెప్పడంతో వాగ్వివాదం మొదలైంది. అయితే నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న వారందరు ఆశ్చర్యానికి లోనయ్యారు.