పరిసరాల శుభ్రత అందరి బాధ్యత కమిషనర్ పి నరసింహ ప్రసాద్

75చూసినవారు
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత కమిషనర్ పి నరసింహ ప్రసాద్
మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛతాహీ సేవ -2024 కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిత్తూరులోని గిరింపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుభ్రత, ప్లాస్టిక్ లేని జీవనం అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ శుభ్రత కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్