చిత్తూరులో జిల్లాలో టేబుల్ రకం మామిడికి మంచి ధర లభిస్తోంది. హిమామ్ టన్ను రూ. 2 లక్షలు, బంగినపల్లి కాయల నాణ్యతను బట్టి టన్ను రూ. 45 వేల నుంచి రూ. 80 వేలు, కాలేపాడు రూ. 50 వేల నుంచి రూ. 80 వేలు, మల్గూబా రూ. లక్ష నుంచి రూ. 1. 2 లక్షలు పలుకుతున్నాయి. సీజన్ ముగిసిపోతుండడంతో రైతుల దగ్గర టేబుల్ రకాల కాయల లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో ధరలు పెరిగినా రైతులకు ఒరిగేది ఏమీ లేదని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.