ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై శ్రద్ధపెట్టి పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గంగవరం మండలం మల్లేరు ఎంపియుపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చర్యలు చేపడుతున్నదని, ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా మరింత భాద్యతాయుతంగా పని చేయాలన్నారు.