జీడీనెల్లూరు(మం) జూపల్లిలో టీడీపీ నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 'దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది' అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.