విద్యాశాఖ మంత్రిని కలిసిన జూనియర్ కళాశాల అతిధి అధ్యాపకులు

50చూసినవారు
విద్యాశాఖ మంత్రిని కలిసిన జూనియర్ కళాశాల అతిధి అధ్యాపకులు
గురువారం ఉండవల్లి నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని చిత్తూరు జిల్లా అతిధి అధ్యాపకుల సంఘం నాయకులు కలిసి దాదాపు 2014 నుంచి ఇప్పటివరకు రూ. 10000 తోనే పనిచేస్తున్నామని, ఇప్పుడు ఉన్నటువంటి నిత్యవసర ధరలను దృష్టిలో ఉంచుకొని జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 1072 మంది జీవితాల్లో వెలుగు నింపాలని ప్రాధ్యేయపడ్డారు.

సంబంధిత పోస్ట్