సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం ఆదివారం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు.