చిత్తూరు జిల్లా కేంద్రంలోని మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం పరిశీలించారు. అక్కడి ఉద్యోగస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ఉన్న యంత్ర పరికరాల పనితీరును పరిశీలించారు. గత పది సంవత్సరాలుగా మూతపడి ఉన్న షుగర్ ఫ్యాక్టరీని త్వరలో ప్రజలకు వినియోగంలోకి తీసుకువస్తానని తెలిపారు.