ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి గురువారం తెలిపారు. మండలంలోని ప్రైవేట్ కళాశాలలో 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి సంస్థ కృషి చేస్తుందన్నారు. యువతలో ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యం చేయించడమే లక్ష్యం అన్నారు. పరిశుభ్రత పచ్చదనం పెంపుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామన్నారు.