చిత్తూరులో నో హెల్మెట్.. నో ఎంట్రీ

72చూసినవారు
చిత్తూరు కోర్టులో 10వ తేదీ నుంచి 'నో హెల్మెట్. నో ఎంట్రీ' నిబంధన ఉంటుందని మంగళవారం జడ్జి భీమారావు తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే శిక్ష పడుతుందని చెప్పారు. కోర్టు ఆవరణ నుంచే అందరూ హెల్మెట్ వాడాలనే నిబంధన అమలు చేస్తున్నామన్నారు. బైకుపై కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా కోర్టు ఆవరణలోకి వస్తే అనుమతించబోమని చెప్పారు.

సంబంధిత పోస్ట్