చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్ ను జిల్లా పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు పి. బి. బాలసుబ్రమణ్యం శనివారం కలిశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు రెడ్డి గోపాల్, సురేష్, ముఖేష్, జ్ఞాన శేఖర్, సిద్ధారెడ్డి, రజని, కోకిల, ముస్తఫా, గిరీష్, పురుషోత్తం ఉన్నారు.