చిత్తూరు నగరపాలక డంపింగ్ యార్డును పక్కాగా నిర్వహించాలని కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలక డంపింగ్ యార్డును కమిషనర్ తనిఖీ చేశారు. డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ యూనిట్ ను పరిశీలించి ఇప్పటివరకు ఎంత వర్మి కంపోస్ట్ తయారు చేశారు? చేపట్టిన విక్రయాలపై ఆరా తీశారు. వర్మీ కంపోస్ట్ మరింత ఎక్కువగా తయారు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.