చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం "ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని" నిర్వహించి ప్రజల నుంచి వినతులను మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్ లు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.