విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు నగరపాలక సంస్థ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు తమ వంతు సాయంగా పది బస్తాల బియ్యాన్ని అందించారు. కార్యదర్శులు అందరూ కలిసి రూ. 10, 000 విలువైన పది బస్తాల బియ్యాన్ని సాయంగా అందించారు. రాష్ట్ర ప్రభుత్వం, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపు మేరకు పదిబస్తాల బియ్యాన్ని బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వారి కార్యాలయంలో అప్పగించారు.