యాదమరి సర్పంచ్ నుంచి ప్రాణహాని ఉంది: భారతి

52చూసినవారు
యాదమరి సర్పంచ్ జగన్నాథ రెడ్డితో పాటు పద్మనాభ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎర్రచేను గ్రామానికి చెందిన భారతి మంగళవారం ఆరోపించారు. చిత్తూరులో ఆమె మాట్లాడుతూ, తన ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా హైకోర్టులో స్టే తెచ్చుకున్నట్లు చెప్పారు. ఈ కక్షతో తనను గ్రామం నుంచి వెలివేశారన్నారు. 6వ తేదీ పెద్దల సమక్షంలో చర్చ జరుగుతుండగా తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్