చిత్తూరులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

58చూసినవారు
చిత్తూరులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
చిత్తూరులో నేడు ఓం శక్తి ఊరేగింపు, గంగమ్మ నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా రెడ్డిగుంట జంక్షన్, ఇరువారం, కాణిపాకం, మురుకంబట్టు, కట్టమంచి వైజంక్షన్, సాంబయ్య కండ్రిగ జంక్షన్ మీదుగా వెళ్లాలని సూచించారు. వేలూరు, పలమనేరు బస్సులు ఇరువారం జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్